తనపై ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. కీలకమైన రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి ఇచ్చినందుకు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గొంతునై రాష్ట్రంలో జరిగే అరాచకాలను ఎప్పటికప్పుడు ఎండకడతానన్నారు. అలాగే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలో క్లుప్తంగా ప్రతి ఒక్కరికి వివరిస్తాను అన్నారు. 2029 సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడానికి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతూ ప్రతి గడప తొక్కి పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను అంటున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి