వైసీపీ నుంచి తప్పుకోగానే అలా షాకులు ! గుర్తు చేసుకున్న కోటంరెడ్డి ..!

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని నేషనల్ హైవేపై 75 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న బైపాస్ ఫ్లై ఓవర్ బ్రిడ్జీలు, సర్వీస్ రోడ్ల పనులను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యాక ఈ పనులు ప్రారంభించానని, రెండోసారి ఎమ్మెల్యే అయ్యాక పనులు మొదలయ్యాయని, కానీ వైసీపీ నుంచి తప్పుకున్నాక మాత్రం ఆగిపోయాయని గుర్తుచేసుకున్నారు. గత ప్రభుత్వంలో ఈ పనులు మంజూరైనా, తాను వైసీపపీ నుంచి దూరంగా జరిగాక ఈ పనులు ఆగిపోయాయన్నారు. ఈసారి మాత్రం వీటిని పూర్తి చేసి తీరుతామన్నారు.