మెగా9 వెబ్ డెస్క్ : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం విఐపి విరామ దర్శన సమయం లో హీరో నిఖిల్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వీరికి సాధర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శన అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేశారు. నిఖిల్ ని చూసిన భక్తులు, అభిమానులు అతనితో ఫోటోలు, సెల్ఫీ లు దిగేందుకు పోటీపడ్డారు. నిఖిల్ కూడా ఎంతో ఓపికగా అడిగిన వారితో ఫోటోలు, సెల్ఫీలు దిగారు. ప్రస్తుతం నిఖిల్ తిరుమల పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్వామివారిని దర్శించుకునే సమయంలో నిఖిల్ వెంట ఆయన భార్య, మామ, చీరాల ఎమ్మెల్యే కొండయ్య తదితరులు ఉన్నారు.
అయితే హీరో నిఖిల్ సిద్ధార్థ ఇటీవల’ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నవంబర్ 8న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకు వెళ్తుంది.