సీఎం చంద్రబాబు ఇంటిముందు రచ్చ రచ్చ చేసిన మహిళ

మెగా9, ఆంద్రప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటి ముందు ఓ మహిళ రచ్చ రచ్చ చేసింది. తిరుపతి, నారావారి పల్లెలో సీఎం చంద్రబాబు ఇంటికి తిరుపతికి చెందిన యశోద అనే మహిళ చంద్రబాబును కలిసి తన సమస్యలను చెప్పేందుకు వచ్చింది. కానీ సీఎం చంద్రబాబును కలవనియకుండా యశోదను పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో యశోద తన చేతి గాజులు పగలగొట్టుకొని వాటిని మింగి ఆత్మహత్యయత్నం చేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమెను అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇందుకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.