ఈ ప్రాజెక్ట్‌ను జూలై, 2027 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిచేస్తాం:కేంద్రమంత్రి పెమ్మసాని

Spread the love

శంకర్ విలాస్ సెంట్రల్ రైల్వే బ్రిడ్జ్ పనుల పురోగతిని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్  పరిశీలించారు. బ్రిడ్జ్‌కు సంబంధించిన పిల్లర్ల నిర్మాణం పూర్తయ్యిందని, అవసరమైన టెక్నికల్ క్లియరెన్సులు కూడా తీసుకున్నామని కేంద్రమంత్రి తెలిపారు.  సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి తుది అనుమతి వచ్చిన వెంటనే 10–15 రోజుల్లో భారీ క్రేన్లతో సెంటర్ పార్ట్ తొలగింపు పనులు ప్రారంభిస్తామని చెప్పారు.  ల్యాండ్ అక్విజిషన్, షాపుల సమస్యలపై అధికారులతో చర్చలు జరుగుతున్నాయి, మిగిలిన అంశాలు కూడా త్వరలో పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌ ను జూలై, 2027 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మేయర్, మున్సిపల్ కమిషనర్, సంబంధిత శాఖల అధికారులు కూడా హాజరయ్యారు. ఆర్‌ఓబి పనుల ప్రగతి, వేగం, నిర్మాణ నాణ్యతతో పాటు ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలు, విమర్శలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈస్ట్ వైపు పనులు వేగంగా కొనసాగుతున్నాయని, పశ్చిమ నియోజకవర్గం వైపు కూడా పనులు ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. ఈ ఆర్‌ఓబి నిర్మాణానికి నిర్ణయించిన డెడ్‌లైన్ జూలై 2027 అయినప్పటికీ, ఆ తేదీకి ముందే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గుంటూరు నగర అభివృద్ధిలో కీలకమైన ఈ శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబి) నిర్మాణ పనులను శరవేగంగా చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది.