నేషనల్ సీనియర్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ తెలంగాణ స్టార్ నిఖత్ జరీన్ (51 కేజీ) ముందంజ వేసింది. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ మొదటి రౌండ్ లో 5-0తో చండీగఢ్ కు చెందిన నిధి పై విజయం సాధించింది. ప్రపంచ చాంపియన్ మీనాక్షి, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా కూడా విజయంతో టోర్నీలో శుభారంభం చేశారు. 48 కిలోల విభాగంలో మీనాక్షి 5-0తో లక్షయపై, లవ్లీనా (75కేజీ) 5-0తో కృష వర్మపై గెలిచారు. పురుషుల విభాగంలో వరల్డ్ కప్ మెడలిస్ట్ హితేష్ గులియా (70కేజీ), పవన్ బర్ త్వాల్ (55 కేజీ), అంకుశ్ పంఘాల్ (80కేజీ) తదుపరి రౌండ్ చేరారు.