హైదరాబాద్ లో భారీగా ఛైనా మాంజా పట్టుకున్న అధికారులు

Spread the love

హైదరాబాద్ నగరంలో నిషేధిత చైనా మాంజాను అధికారులు భారీగా పట్టుకున్నారు. దీని విలువ రూ.1.2 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఢిల్లీ, సూరత్, మహారాష్ట్ర నుంచి దుకాణాదారులు చైనా మాంజాను తెప్పించే క్రమంలో వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై నిషేధం ఉన్నప్పటికీ వ్యాపారాలు  దీన్ని తెప్పిస్తున్నారు. గాలి పటాలు  ఎగురవేసే సమయంలో అవి తెగి మాంజా గాలిలో వేలాడుతున్నాయి. దీంతో వాహనాలపై ప్రయాణించేవారికి చుట్టుకొని తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.చైనా మాంజాను నైలాన్ మరియు సింథటిక్ ప్లాస్టిక్ పదార్థాలతో తయారు చేయడం వల్ల ఇది సులభంగా తెగదు, దీనివల్ల గాలిపటాలు ఎగురవేసేటప్పుడు ప్రమాదవశాత్తు ఈ దారం మెడకు లేదా శరీరానికి తగిలితే లోతైన గాయాలు కావడమే కాకుండా ప్రాణాపాయం కూడా సంభవిస్తుంది. ఇది కొన్నిసార్లు విద్యుత్ తీగలకు తగిలినప్పుడు షార్ట్ సర్క్యూట్‌లకు కారణమై ప్రాణనష్టం కలిగిస్తుంది. పక్షులు ఎగిరేటప్పుడు ఈ దారంలో చిక్కుకుంటే వాటి రెక్కలు తెగిపోయి వికలాంగులు అవ్వడం లేదా మరణించడం జరుగుతుంది. ఈ దారం భూమిలో కలిసిపోని ప్లాస్టిక్ పదార్థం కావడంతో పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తుంది. మానవ ప్రాణాలకు, మూగజీవాలకు మరియు పర్యావరణానికి ముప్పుగా మారిన ఈ ప్రమాదకరమైన చైనా మాంజాను ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది.