వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ చెప్పేవన్నీ అబద్ధాలని ఫైర్ అయ్యారు. ప్రజలు జగన్ చెప్పే అబద్ధపు మాటలు నమ్మరని అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో రూ. 925కోట్లు జగన్ అనుయాయులకు కట్టబెట్టారని ఆరోపించారు. రాజధాని విజయవాడ గుంటూరు మధ్యలో కట్టాలని జగన్ చెబుతున్నారని అయితే రాజధాని విజయవాడ కి గుంటూరు కి సమీపంలోనే ఉందని పేర్కొన్నారు. ఏపీ ప్రజలు ఎప్పుడు బాధ పడాలని జగన్ కోరుకుంటున్నారని దుయ్యబట్టారు. మంగళగిరి, విజయవాడ, గుంటూరు లను కలిపి మహా నగరం నిర్మించేందుకు సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. మూడు మహా నగరాలు కట్టిన చరిత్ర చంద్రబాబుదని పేర్కొన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని అటకెక్కించింది జగన్ ప్రభుత్వమేనని శివనాథ్ ఆక్షేపించారు. బోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. చరిత్రలో అత్యంత హీనమైన ఓటమి జగన్ దేనని వైసీపీ చరిత్ర అయ్యిపోయిందన్నారు. మరో 25ఏళ్లు కూటమి ప్రభుత్వం ఉంటుందని జోస్యం చెప్పారు. అప్పటి వరకు చంద్రబాబు ఉంటారా అని జగన్ అనడం సిగ్గుచేటని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు తగ్గించారన్నారు. అమరావతి, విశాఖపట్నం, రాయలసీమలను కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు.