డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్‌ కు భారీ ఊరట

Spread the love

ప్రముఖ నటుడు నవదీప్‌ కు డ్రగ్స్ కేసులో భారీ ఉపశమనం లభించింది. తెలంగాణ హైకోర్టు ఆయనపై నమోదైన డ్రగ్స్ కేసును కొట్టివేసింది. గుడిమల్కాపూర్‌లో నమోదైన ఈ కేసులో నవదీప్ వద్ద ఎలాంటి మత్తు పదార్థాలు దొరకలేదన్న అంశాన్ని న్యాయస్థానం క్లియర్ గా గుర్తించింది. నవదీప్ తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ వెంకట సిద్ధార్థ్ మాట్లాడుతూ  ఈ కేసులో నవదీప్ పేరు కేవలం ఎఫ్ఐఆర్ లో మాత్రమే ఉందని, సంఘటన జరిగిన ప్రదేశంలో ఆయన వద్ద డ్రగ్స్ ఏవీ లభించలేదనిన్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. సంఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో నవదీప్‌ కు సంబంధించిన ఆధారాలు లేవని తెలిపారు. ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు సరైన ఆధారాలు లేకుండా కేసు కొనసాగించడం సరికాదని నవదీప్ వద్ద డ్రగ్స్ లభించనందున, ఆయనపై నమోదైన కేసును కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో నవదీప్‌ కు చట్టపరంగా భారీ ఊరట లభించింది.