మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ దే హవా:టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 

Spread the love

పల్లె పోరులో ఘన విజయాన్ని అందుకున్న  కాంగ్రెస్ త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తోంది.  రాబోయే  మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయ బావుటా ఎగురవేస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ దీమా వ్యక్తం చేశారు. సర్వేల ఆధారంగా అభ్యర్ధులకు బీఫామ్లు ఇస్తామని తెలిపారు. నిజామాబాద్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకున్నాం. మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం తమ పార్టీదేనన్నారు. కాంగ్రెస్ నిజామాబాద్ నగరంలో మంచి మెజార్టీతో విజయం సాదిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పంపిణీ , పేదవాడి సొంతింటి కల ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తోందన్నారు.నిజామాబాద్ జిల్లాకు మరో రెండు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తామన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఓట్ల రూపంలో కనిపిస్తుందన్నారు.