సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం బీ.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ రి ఆధ్వర్యంలో జరుగుతున్న శాంతియుత ర్యాలీని అడ్డుకోవడం, కార్యకర్తలను అరెస్టు చేయడం హేయమైన చర్యని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి హరీష్ రావు దుయ్యబట్టారు. ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యమే మా ఏడవ గ్యారంటీ అని చెప్పిన రేవంత్ రెడ్డి నేడు ప్రశ్నించే గొంతుకలను పోలీసులతో అణచివేస్తూ నిరంకుశత్వమే తమ పాలసీ అని నిరూపిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని చెప్పి.. అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మార్చడం సిగ్గుచేటు. గాంధేయ మార్గంలో శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని అడ్డుకోవద్దని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని మీ నిర్బంధాలకు భయపడేది లేదు. చారిత్రక సికింద్రాబాద్ అస్తిత్వం కోసం మా పోరాటం ఆగదని హరీష్ ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేశారు.