ఎవల్యూషన్ సినర్జిటిక్ ఎండీ జోస్ మెల్లాడోతో ఏపీ మంత్రి లోకేష్ భేటీ

Spread the love

ఎవల్యూషన్ సినర్జిటిక్ ఎండీ (స్పెయిన్) మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ జోస్ మెల్లాడోతో ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు.  గ్రీన్ హైడ్రోజన్ మరియు జీరో-ఎమిషన్ మొబిలిటీ రంగాలలో ప్రపంచ స్థాయి భాగస్వామ్యాలను బలోపేతం చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ఎంతో ఆసక్తిగా ఉందని తెలిపారు. వైజాగ్ లేదా కాకినాడ ఓడరేవులలో హైడ్రోజన్ టెర్మినల్ ట్రాక్టర్లను పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించాలని, అలాగే ఎలక్ట్రిక్ మరియు హైడ్రోజన్ ఆఫ్-రోడ్ వాహనాలను సంయుక్తంగా అభివృద్ధి చేయాలని EVO సంస్థను ఆహ్వానించినట్లు లోకేష్ తెలిపారు.. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెస్ట్‌బెడ్లు, అనుమతులు, ఇంజనీరింగ్ సాండ్‌బాక్స్‌లతో పాటు ప్రోటోటైప్‌ల తయారీకి మరియు నైపుణ్య శిక్షణకు పూర్తి మద్దతును అందిస్తుందని పేర్కొన్నారు.