బిజీబిజీగా దావోస్ టూర్..యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మంత్రితో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ 

Spread the love

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల కల్పనే లక్ష్యంగా దావోస్‌ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టూర్ బిజీబిజీగా కొనసాగుతోంది. తొలి రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక-పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ – యూఏఈ మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతో కలిసి యూఏఈ దుబాయ్ ఫుడ్ క్లస్టర్‌ పని చేస్తుందని, యూఈఏకి చెందిన సుమారు 40 సంస్థలు ఏపీలో ఏర్పాటు చేసేలా తోడ్పాటు అందిస్తామన్నారు మార్రీ. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ కూడా పాల్గొన్నారు. జ్యూరిచ్ తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో కూడా సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులను సిద్ధం చేస్తున్నామని  స్విట్జర్లాండ్ లో భారత రాయబారి మృదుల్ కుమార్ తో సీఎం చంద్రబాబు మాట్లాడారు. మరికొందరు దేశ విదేశీ నేతలను సీఎం చంద్రబాబు కలిశారు.