ఆరోగ్యకరమైన సమాజమే వికసిత్ భారత్ నిర్మాణానికి అసలైన పునాది:మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 

Spread the love

ప్రకృతికి దగ్గరగా ఉంటేనే ఆరోగ్యం మెరుగుపడుతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. పాశ్చాత్య ఆహారాన్ని వదిలి జొన్నలు, రాగులు వంటి తృణధాన్యాలను మన ఆహారంలో భాగం చేసుకోవాలన్నారు. వైద్య విద్యార్థులు తమ కెరీర్‌ లో కొంత సమయాన్ని తప్పనిసరిగా గ్రామీణ సేవకు కేటాయించాలని పిలుపునిచ్చారు చికిత్స కన్నా నివారణ మేలని అవగాహన కలిగించాలని సూచించారు.  చిన్నకాకానిలోని ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆవరణలో అత్యాధునిక ‘కాథ్ ల్యాబ్’ను  నేడు ఆయన  ప్రారంభించారు. నూతన ఆడిటోరియంకు శంకుస్థాపన చేయడం  పట్ల సంతోషంగా వ్యక్తం చేశారు. కేవలం 30 మంది ప్రవాస భారతీయ వైద్యుల కృషితో మొదలై, నేడు 1050 పడకల స్థాయికి ఎదిగి పేదలకు రాయితీపై నాణ్యమైన వైద్యం అందిస్తున్న ఈ సంస్థ సేవలు  అభినందనీయమని కొనియాడారు. భారతదేశంలో 60% మరణాలు జీవనశైలి వ్యాధుల (NCDs) వల్లే సంభవిస్తున్నాయని అనారోగ్యం వల్ల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు దేశ ఆర్థిక ప్రగతి కూడా మందగిస్తుందని అన్నారు.  వైద్యులు కేవలం చికిత్సకే పరిమితం కాకుండా, యోగా, వ్యాయామం , సరైన పోషకాహారంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఆరోగ్యకరమైన సమాజమే వికసిత్ భారత్ నిర్మాణానికి అసలైన పునాదని స్పష్టం చేశారు.