దశాబ్దాలుగా, “చికెన్స్ నెక్” (Chicken’s Neck) ప్రాంతాన్ని దేశం లోపల మరియు వెలుపల ఉన్న దేశద్రోహ శక్తులు బెదిరింపులకు ఒక సాధనంగా వాడుకుంటున్నాయని అయితే తాజాగా ప్రతిపాదించిన అండర్ గ్రౌండ్ ట్రైన్ లింక్ ఒక ప్రధాన వ్యూహాత్మక ముందడుగని అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ అన్నారు. ఇది ఈశాన్య రాష్ట్రాలకు మరియు దేశంలోని మిగిలిన ప్రాంతాలకు మధ్య సురక్షితమైన మరియు తిరుగులేని రవాణా మార్గాన్ని సృష్టిస్తుందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోడీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వారి నిర్ణయాత్మక నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఇది నిజంగా ఒక గొప్ప విషయం! సుదీర్ఘకాలంగా ఉన్న ఈ వ్యూహాత్మక లోపాన్ని సరిదిద్దడానికి మనం ఒక భారీ అడుగు వేస్తున్నామని నిజానికి దీనిని చాలా కాలం క్రితమే, బహుశా 1971 యుద్ధం తర్వాతనే పరిష్కరించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. “సిలిగురి కారిడార్” నే చికెన్స్ నెక్ అని పిలుస్తారు. మనకు మ్యాప్ లో చూస్తే అలాగే కనిపిస్తుంది కూడా.ఇది భారతదేశాన్ని ఈశాన్య రాష్ట్రాలతో (North East India) కలిపే అతి సన్నని భూభాగం. వ్యూహాత్మకంగా ఈ ప్రాంతానికి చాలా ప్రాధాన్యత ఉంది.