అరవ శ్రీధర్ ను సుదీర్ఘంగా విచారించిన జనసేన త్రిసభ్య కమిటీ

Spread the love

రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను జనసేన త్రిసభ్య కమిటీ సుదీర్ఘంగా విచారించింది. పార్టీ అధినేత పవన్ ఆదేశాల మేరకు రైల్వే  కోడూరుకు వచ్చారు. కమిటీలో రమాదేవి, శివశంకర్, టీ.సీ.వరుణ్  సభ్యులుగా ఉన్నారు స్థానిక రాజ్ రెసిడెన్సీలో ఎమ్మెల్యేతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు విచారణ కొనసాగింది. బాధితురాలు చేసిన ఆరోపణలు, వాట్సప్ మెసేజ్ ల వ్యవహారం, గ్రౌండ్ లెవల్ లో  వాస్తవ పరిస్థితులపై అరవ శ్రీధర్ ను కమిటీ సభ్యులు ప్రశ్నించారు. ఎమ్మెల్యే తన వాదనను కమిటీ ముందు సవివరంగా వినిపించారు. ఎమ్మెల్యేనే కాకుండా పార్టీలో యాక్టివ్ గా ఉన్న సుమారు 40 మంది ఎంపిక చేసిన నాయకులు, కార్యకర్తలను కూడా కమిటీ పిలిపించి వివరాలు అడిగి తెలుసుకుంది. ఎమ్మెల్యే ప్రవర్తన, తాజా పరిణామాలపై వారి నుంచి సమాచారం సేకరించింది. సాయంత్రం మరోసారి ఎమ్మెల్యేని పిలిపించి మాట్లాడారు. విచారణలో వెల్లడైన అంశాలతో సమగ్ర నివేదికను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు  అందజేయనున్నట్లు సభ్యులు తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు కమిటీ ముందు విచారణకు హాజరై.. నా వాదనను వినిపించా. ఇది నా వ్యక్తిగత వ్యవహారం.. దీన్ని జనసేన పార్టీకి ఆపాదించవద్దని నాపై ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. వాటిని చట్టబద్దంగా ఎదుర్కొంటానని అరవ శ్రీధర్ తెలిపారు.