మూడు రోజుల విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకుని మంత్రి నారాయణ నేతృత్వంలోని బృందం తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. అమరావతి రాజధానిలో పర్యాటక రంగ అభివృద్ధి మరియు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మాణంలో భాగంగా, మున్సిపల్ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ మరియు అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ తో కలిసి మంత్రి నారాయణ లండన్ మరియు దోహా నగరాలలో పర్యటించారు. అక్కడ అంతర్జాతీయ ప్రమాణాలను అధ్యయనం చేయడానికి పలు స్టేడియంలను మరియు స్పోర్ట్స్ పార్కులను పరిశీలించడంతో పాటు, అధికారులతో కీలక చర్చలు జరిపారు. ఈ మూడు రోజుల విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఈరోజు విజయవాడకు చేరుకున్నారు.