ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ క్రైస్తవ సోదర సోదరీమణులకు లెంట్ సీజన్ శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవులు అత్యంత పవిత్రంగా భావించే 40 రోజుల ఉపవాస దీక్షల ప్రారంభం సందర్భంగా ఆయన తన సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ ఆశీర్వాదకరమైన మరియు అర్థవంతమైన ఈ లెంటు (Lent) కాలం సందర్భంగా నా శుభాకాంక్షలు. మీరు ఉపవాసం, ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు జీవితం మరియు ఆయన త్యాగాన్ని స్మరించుకుంటూ గడిపే ఈ 40 రోజుల దీక్షా కాలం.. మీలో విశ్వాసాన్ని, కరుణను మరియు నిరీక్షణను పెంపొందించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఆయన పోస్ట్‌పై క్రైస్తవ సంఘాల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. పలువురు నెటిజన్లు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ తమ స్పందన తెలియజేస్తున్నారు.