భారత నౌకాదళ శక్తికి ఇది గొప్ప నిదర్శనం:కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు 

Spread the love

భారత రాష్ట్రపతి & సాయుధ దళాల సర్వసైన్యాధిపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారితో కలిసి విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR) 2026లో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈమేరకు ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. “United Through Oceans” అనే థీమ్‌తో జరిగిన IFR 2026 భారత్ సముద్ర శక్తి పెరుగుదలను, ప్రపంచ దేశాలతో బలపడుతున్న భాగస్వామ్యాలను ప్రతిబింబించిందన్నారు.  ఈ సందర్భంగా స్వదేశీ విమాన వాహక నౌక INS విక్రాంత్ పాల్గొనడం గర్వకారణం, ఇది ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర పోషించి రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రతీకగా నిలిచిందని కొనియాడారు. అంతర్జాతీయ నావికాదళాల భాగస్వామ్యం ఇండో-పసిఫిక్ అంతటా సముద్ర భద్రత, సహకారం మరియు శాంతి పట్ల సమిష్టి సంకల్పాన్ని ప్రదర్శించింది. భారత నౌకాదళం గ్లోబల్ స్థాయిలో ఎదుగుతున్న శక్తికి ఇది గొప్ప నిదర్శనమని పేర్కొన్నారు. ఇక INS సుమేధా నౌకపై ప్రయాణిస్తూ రాష్ట్రపతి ముర్ము భారత నౌకాదళం మరియు మిత్ర దేశాల నౌకాదళాలకు చెందిన 72 ఆధునిక యుద్ధ నౌకలు, సబ్‌మరైన్లను సమీక్షించారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేశ్ కె త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *