రాష్ట్రంలోని రైతు సోదరులకు శుభవార్త:ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు

Spread the love

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్రంలోని రైతు సోదరులకు శుభవార్త చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం మేరకు, రబీ సీజన్ 2025-26లో పండించిన శనగల కొనుగోళ్లను ఈ రోజు నుంచే రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ అనుమతితో NAFED, NCCFల ద్వారా మొత్తం 94,500 మెట్రిక్ టన్నుల శనగలను ధర మద్దతు పథకం (PSS) కింద సేకరించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రం నుంచి ఆదేశాలు అందాయని నేటి నుంచే అన్ని జిల్లాల్లో CM APP ద్వారా కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.​ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ఉండే జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలు (DLPC) ఈ కొనుగోళ్లను పర్యవేక్షిస్తాయిన్నారు. వ్యవసాయం, ఉద్యానవనం, మార్కెటింగ్, ఏపీ మార్క్‌ఫెడ్ వంటి అన్ని శాఖల సమన్వయంతో నేరుగా రైతు సేవా కేంద్రాల్లోనే (RSK) ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. పారదర్శకత కోసం PACS, FPOలు మరియు స్వయం సహాయక సంఘాలను కూడా ఈ కొనుగోళ్లలో భాగస్వామ్యం చేస్తున్నట్లు వివరించారు. 

మన రాష్ట్రంలో ఈ సీజన్‌లో సుమారు 3.25 లక్షల హెక్టార్లలో శనగల సాగు జరిగిందని, దాదాపు 3.77 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు.  రైతులు తమ పంటను సమీపంలోని ఆర్ఎస్కేలలో నమోదు చేసుకోవాలని కోరుతున్నాను. కొనుగోలు చేసిన 15 రోజుల లోపే నగదు నేరుగా మీ ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *