బండి భగీరథ్‌ పై నమోదైన కేసుకు సంబంధించి విచారణ కోసం స్పెషల్  టీమ్‌ల ఏర్పాటు

Spread the love

పేట్‌ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌ లో బండి భగీరథ్‌ పై నమోదైన కేసుకు సంబంధించి సమగ్ర విచారణ కోసం స్పెషల్  టీమ్‌లను ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ని ఆదేశించారు. కేసు వివరాలను సీఎం కు  డీజీపీ వివరించారు. ఈ నెల 8వ తేదీన ఫిర్యాదు అందినప్పటికీ ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఈ సందర్భంగా సీఎం రేవంత్ ప్రశ్నించారు. ప్రధానమంత్రి మోడీ  హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసు సిబ్బంది భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారని డీజీపీ వివరించారు. తక్షణమే విచారణను ముమ్మరం చేయాలని, సమగ్ర విచారణ కోసం ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *