సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ విడుదల

Spread the love

కెరీర్ ఆరంభం నుండి డిఫెరెంట్ రోల్స్ తో అలరించి ఆ తర్వాత హీరోగా తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు సందీప్ కిషన్. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘సిగ్మా’ విడుదలకు రెడీ అయింది. తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకత్వం వహించారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. సినిమా పక్కా కమర్షియల్ క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతుందని అర్థమవుతోంది. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించగా, నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రవీణ్ కేఎల్ ఎడిటర్‌గా, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను ప్రముఖ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి రిలీజ్ చేశారు. ట్రైలర్ పై ఆయన ప్రశంసలు కురిపించారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, సినిమాలో తల్లి-కొడుకుల సెంటిమెంట్ ఎమోషనల్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అలాగే రాజు సుందరం క్యారెక్టర్ కూడా ఆకట్టుకుంది. సంపత్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి వసూళ్లను సాధిస్తుందో చూడాలి. విభిన్న కథాంశాలతో ముందుకు వెళ్తున్న సందీప్ కిషన్ కెరీర్‌లో ఈ చిత్రం మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. విజయ్ తనయుడు మెగాఫోన్ పట్టడంతో అందరి దృష్టి ఈ ప్రాజెక్ట్‌పై పడింది. ఆయన అభిమానులు కూడా తమ అభిమాన హీరో తనయుడు సినిమాను ఎలా డైరెక్ట్ చేశాడో చూడాలని ఎదురుచూస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను మైత్రీ మూవీస్ మరియు ఎన్.వి.ఆర్ సినిమా విడుదల చేస్తున్నారు. 

విభిన్న పాత్రలతో తనకంటూ ఒక విశిష్టమైన క్రేజ్ తెచ్చుకున్న నటుడు సందీప్ కిషన్. పాత్ర ఏదైనా తనదైన మార్క్ ఎనర్జీతో స్క్రీన్ పై అద్భుత  నటనను కనబరచడం ఆయన నైజం. “ప్రస్థానం”లో చిన్న పాత్రతోనే తనలోని నటుడిని ప్రేక్షకుల ముందుంచి మంచి మార్కులు తెచ్చుకున్న సందీప్, ఆ తర్వాత వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ వర్సటైల్ యాక్టర్ గా ఎదిగారు. కామిడీ, యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ ఇలా జానర్ ఏదైనా సరే పాత్ర పరిధి మేరకు నటిస్తారు. అలాగే స్క్రీన్ పై కనిపించగానే ఒక రకమైన పాజిటివ్ వైబ్ ని తీసొచ్చే అరుదైన హీరోయిన్స్ లో ఫరియా అబ్దుల్లా ప్రత్యేకం. “జాతి రత్నాలు” చిత్రంతో ఎంట్రీ ఇచ్చి, తన మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కేవలం గ్లామర్ రోల్స్ కే పరిమితం కాకుండా, డ్యాన్స్, థియేటర్ ఆర్ట్స్ నుంచి వచ్చిన తన ప్రతిభను ప్రతి పాత్రలోనూ చూపిస్తుంటారు ఫరియా. ఎనర్జిటిక్ యాక్టింగ్ తో పాటు ఎలాంటి సీన్ లోనైనా నాచురల్ గా ఒదిగిపోయే ఆమె నటన తెలుగు ప్రేక్షకులకు చాలా ఫ్రెష్ ఫీల్ ఇస్తున్నారు. సందీప్ కిషన్ మరియు ఫరియా అబ్దుల్లా కలిసి నటిస్తున్నారంటే స్క్రీన్ పై ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిద్దరి కాంబినేషన్ స్క్రీన్ పై చూసేందుకు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ అండ్ కామిడీ సీన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయని టాక్. వీరిద్దరూ చేయబోయే మ్యాజిక్ సినిమాకి అతిపెద్ద హైలైట్ గా నిలవబోతోందని తెలుస్తోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *