ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ‘ఏపీ స్టేట్ లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్-2026’

Spread the love

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నేటి నుండి మూడు రోజుల పాటు విజయవాడ వేదికగా ‘ఏపీ స్టేట్ లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్-2026’ నిర్వహించనున్నారు. క్రికెట్, కబడ్డీ, టెన్నిస్, క్యారమ్స్, షటిల్ బ్యాడ్మింటన్, వాలీబాల్, రన్నింగ్ రేస్, షాట్పుట్, టేబుల్ టెన్నిస్, పికిల్ బాల్, టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ ఛైర్స్, త్రోబాల్, చెస్ వంటి  14 స్పోర్ట్స్ లో  మొత్తం 156 మంది ప్రజాప్రతినిధులు తలపడనున్నారు. కొందరు మూడు నాలుగు ఆటల్లోనూ పాల్గొనేందుకు పేర్లు నమోదు చేయించుకున్నారు. ఐజీఎంసీ, డీఆర్ఆర్ఎంసీ స్టేడియాల్లో ఈ పోటీలు జరగనున్నాయి. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, మంత్రులు వాసంశెట్టి సుభాష్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డిలు కబడ్డీ జట్లకు కెప్టెన్లుగా ఉండనున్నారు. అన్నింటిలో క్రికెట్ ముందువరుసలో ఉంది. ఇందులో ఆడేందుకు 82 మంది ఇంట్రెస్ట్ చూపారు. వీరందరూ ఆరు జట్లుగా తలపడనున్నారు. ఆయా జట్లకు మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, మండిపల్లి రాంప్రసాన్రెడ్డి, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, టీడీపీ  రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కెప్టెన్లుగా ఉండనున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *