ఈ సంవత్సరంలో 2500 ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలు:ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు  

Spread the love

ప్రయాణికులకు మంచి రవాణా సేవలందించే విధంగా ఏపీ సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నట్లు ఏ.పీ.ఎస్.ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు అన్నారు. ఆ సంస్థ ఎండీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీలో సమస్యల పరిష్కారం, అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు. ఈ సంవత్సరం మొత్తం 2,500 ఎలక్ట్రికల్ సీ.ఎన్.జీ బస్సులు కొనుగోలు చేస్తామని అన్నారు. ఈ ఏడాది చివరి కల్లా కేంద్రం ఇచ్చే 1050 ఎలెక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కాలం చెల్లిన బస్సులను ఎప్పటికప్పుడు రీప్లేస్ చేస్తామన్నారు. ఇక సంస్థలో అవసరమైనంత మేరకు డ్రైవర్లను రిక్రూట్ చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. ఆర్టీసీ ఎంప్లాయ్స్ కు మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. ఎంప్లాయిస్ ప్రమోషన్స్ సమస్యను పరిష్కరిస్తామన్నారు.