చంద్రన్న కోసం 520 కిలోమీటర్లు, 23 రోజులు…బండ్ల గణేష్ పాదయాత్ర విజయవంతం

Spread the love

ఏపీ సీఎం చంద్రబాబు కోసం ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన పాదయాత్ర షాద్ నగర్ నుంచి దాదాపు 23 రోజులపాటు 520 కిలోమీటర్ల పైగా సాగింది. నేడు ఆయన  తిరుపతికి చేరుకున్న సందర్భంగా టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. అలిపిరి పాదాల మండపం నుంచి తిరుమలకు సినీ నిర్మాత బండ్ల గణేష్ కాలినడకన బయలుదేరారు. గోవింద నామస్మరణల మధ్య పాదయాత్రను ప్రారంభించిన ఆయన, పాదాల మండపం వద్ద టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించారు.ఈ సందర్భంగా కమ్మ అభివృద్ధి, సంక్షేమ సంఘం ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తదితరులు సంఘీభావం తెలిపారు.బండ్ల గణేష్ మాట్లాడుతూ,చంద్రన్న కోసం వెంకన్న దగ్గరికి బండ్లన్న యాత్ర విజయవంతం అయిందన్నారు.శ్రీవారి ఆశీస్సులతోనే ముందుకు అడుగులు వేశాను. సంకల్పయాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. 520 కిలోమీటర్లు, 23 రోజుల పాటు ఎలాంటి అలసట లేకుండా నడిచాను. ఎక్కడా ఇబ్బంది పడలేదు. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఆశీర్వదించారు. రేపు వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుని సంకల్పయాత్రను ముగిస్తాను అని తెలిపారు.యాత్ర విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.