ఆధార్ అప్‌డేట్ అలర్ట్: పదేళ్లకోసారి తప్పనిసరి.. విశాఖలో నేటి నుంచే ప్రత్యేక శిబిరాలు

Spread the love

ఆధార్ కార్డును కేవలం ఒకసారి పొందితే సరిపోదు, భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి పదేళ్లకు ఒకసారి దానిని నవీకరించడం (Update) తప్పనిసరి అని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) స్పష్టం చేసింది.ముఖ్యంగా 5 – 15 ఏళ్ళు దాటిన పిల్లలకు బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించడం అత్యంత కీలకమని పేర్కొంది.ఒకవేళ ఐదేళ్లు దాటిన తర్వాత కూడా బయోమెట్రిక్ నవీకరించకపోతే, వారికి జారీ చేసిన ‘బాల ఆధార్’ పనిచేయదు.విద్యాసంస్థల్లో అడ్మిషన్లు, స్కాలర్‌షిప్పులు, జాతీయ స్థాయి పరీక్షలు , ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు ఆధార్ అప్‌డేట్ ఇప్పుడు అనివార్యంగా మారింది.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో లక్షకు పైగా బయోమెట్రిక్ అప్‌డేట్లు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.దీనిని దృష్టిలో ఉంచుకుని, జనవరి 5 (నేడు) నుండి జనవరి 9 వరకు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ,  ప్రైవేటు పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ శిబిరాలను (Special Camps) ఏర్పాటు చేశా