భోగాపురం విమానాశ్రయంలో తొలిసారిగా ల్యాండ్ అయిన వాలిడేషన్ విమానంలో ప్రయాణించడం ఎంతో గర్వంగా ఉందని కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఈ ప్రాంత భవిష్యత్తు మరియు కనెక్టివిటీకి పూర్తిగా కొత్త దిశ ఆరంభంకానుంది. ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రయాణానికి వేసిన, చారిత్రాత్మక తొలి అడుగని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆత్మీయ స్వాగతం అందించిన ప్రజాప్రతినిధులు, GMR గ్రూప్, అధికారులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రాంత అభివృద్ధిని ముందుగా ఉంచి, ఈ చారిత్రక ప్రాజెక్టుకు భూమిని త్యాగం చేసి సహకరించిన రైతులందరికీ మరొక్కసారి తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అందరి సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైంది. దేశంలో ప్రపంచస్థాయి విమానయాన అభివృద్ధి కి బలమైన దిశానిర్దేశం అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారం, సీఎం చంద్రబాబు ఆలోచనలతో రూపుదిద్దుకున్న ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధి, ఉపాధి, గ్లోబల్ కనెక్టివిటీకి శక్తికేంద్రంగా నిలవనుందని తెలిపారు.