నిన్న మదనపల్లె పట్టణం నీరు గట్టుపల్లిలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం.. హత్య చేసిన మానవ మృగం కులవర్ధన్ మృతి చెందాడు. ఆ కామాంధుడు కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని కణసానోలపల్లి చెరువులో శివమై తేలినట్లు గుర్తించారు. మంగళవారం మదనపల్లిలో ఏడేళ్ల బాలికను అతికిరాతకంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన కులవర్ధన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.నిందితుడు కురబలకోట మండలం పరిధిలోని అంగళ్లు సమీపంలోని కంసాన్ వారిపల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. బాలిక హత్య కేసులో ఇప్పటికే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ పరిణామం మరింత కలకలం రేపుతోంది. పోలీసులు కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించనున్నారు.