ఇరుసుమండ బ్లోఅవుట్ ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ 

Spread the love

డాక్టర్ బీఆర్ ఆంబేద్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం, ఇరుసుమండ బ్లోఅవుట్ ప్రాంతాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం ఘటనపై ఓఎన్జీసీ అధికారులు, కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎంపీ హరీష్‌, ఎమ్మెల్యే వరప్రసాద్‌తో మండపేట నియోజకవర్గం, రాయవరంలో సమీక్ష నిర్వహించారు. బ్లో అవుట్ నివారణకు సంబంధించిన చర్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు. వ్యాపించిన మంటల కారణంగా దెబ్బతిన్న కొబ్బరిచెట్లకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఈసందర్భంగా  ఆదేశించారు.