ఏపీ అసెంబ్లీలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు పై మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు భూ సమీకరణ, సేకరణ ద్వారా భూమిని సేకరిస్తున్నట్లు తెలిపారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు పీపీపీ పద్ధతి లో నిర్మాణం చేస్తున్నాం. రాజధాని లోని ట్రంక్ రోడ్స్ మౌలిక సదుపాయాలు ADB,ప్రపంచ బ్యాంకు, హడ్కో, నాబార్డ్, వివిధ సంస్థల ద్వారా 40,847 కోట్లు సమకూర్చినట్లు పేర్కొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ భూ సమీకరణ అయిపోయిన తర్వాత అభివృద్ధి కోసం కనీసం 24 నుంచి 30 నెలల సమయం పడుతుంది. రాజధాని లోని ట్రంక్ రోడ్స్ ఏప్రిల్ 2027 కి పూర్తి చేసేందుకు ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు లో 96.2. కి.మీ పొడవు,75 మీటర్ల వెడల్పుతో 8+4 వరసలు రోడ్డు నిర్మాణానికి డిజైన్ చేశామన్నారు. రెండు ఫేజ్ లలో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. మొదటిప్ ఫేజ్ లో కేతన కొండ నుంచి నున్న వరకు రెండో ఫేజ్ లో నున్న నుంచి కేతన కొండ వరకు నిర్మాణం. మొదటి దశ లో 67.6 కిలోమీటర్ల నిర్మాణం. గుంటూరు జిల్లాలో 14, పల్నాడు జిల్లాలో 3,, కృష్ణ జిల్లాలో 6 , ఎన్టీఆర్ జిల్లాలో 3 గ్రామాలు , మొత్తం 26 గ్రామాల ద్వారా నిర్మాణం. మొదటి దశకు డీపీఆర్ కూడా సిద్ధమయ్యిందని తెలిపారు. మొదటి దశ నిర్మాణానికి భూ సమీకరణ ప్రారంభించాం. ఆరు నెలల్లో భూ సమీకరణ పూర్తి చేసే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.