అంబటి రాంబాబుకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్

Spread the love

ఏపీ సీఎం చంద్రబాబుపై అసభ్య పదజాలంతో తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అంబటి రాంబాబును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఆయనకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ గుంటూరు ప్రత్యేక జూనియర్ సివిల్ న్యాయస్థానం న్యాయమూర్తి జి.స్రవంతి నిన్న  రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మొన్న  గుంటూరులోని గోరంట్ల వద్ద అంబటి రాంబాబు తన వాహనంలో వస్తూ సీఎం చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలు చేసిన ఘటన తీవ్ర దుమారం రేపింది. దీనిపై టీడీపీ శ్రేణులు భారీగా నిరసన వ్యక్తం చేశాయి. అంబటి ఇల్లు, కార్యాలయంపై దాడికి పాల్పడ్డాయి. గుంటూరు జిల్లా టీడీపీ  అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు, నల్లపాడు ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అంబటి రాంబాబుపై నల్లపాడు పోలీసుస్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అంబటిని ఆరోజు రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. నల్లపాడు పోలీసు స్టేషన్కు తరలించారు.  ఆదివారం గుంటూరు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు తీయించారు. రాత్రి 8.45 గంటలకు స్థానిక ప్రత్యేక జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో హాజరుపరిచారు.