కేంద్ర బడ్జెట్ పై రాహుల్ గాంధీ పెదవి విరిచారు. భారతదేశం ఎదుర్కొంటున్న వాస్తవ సంక్షోభాల పట్ల కళ్లు మూసుకుని, తప్పులను సరిదిద్దుకోవడానికి నిరాకరించిన బడ్జెట్ ఇదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఉద్యోగాలు లేని యువత. పడిపోతున్న ఉత్పాదక రంగం. పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్న ఇన్వెస్టర్లు. ప్రజల పొదుపు మొత్తాలు భారీగా పడిపోవడం. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతులు. ముంచుకొస్తున్న ప్రపంచ ఆర్థిక ఒడిదుడుకులు – వీటన్నింటినీ విస్మరించారని తన ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.