జూరిచ్ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు 

Spread the love

దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు జూరిచ్ చేరుకున్నారు. ‘సంభాషణ స్ఫూర్తి’ (A Spirit of Dialogue) అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ సమావేశం, వ్యాపార, ప్రభుత్వ, అంతర్జాతీయ సంస్థలు మరియు విద్యా రంగాలకు చెందిన ప్రపంచ నాయకులను ఒకచోట చేర్చి భవిష్యత్తును రూపొందించే ఒక గొప్ప వేదికని పేర్కొన్నారు.  ఇక్కడ నా రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు మరియు నా ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన మరో గర్వకారణమైన అవకాశమని చంద్రబాబు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారికి  సాదర స్వాగతం పలికిన స్విట్జర్లాండ్‌లోని భారత రాయబారి మృదుల్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశం కోసం భారత్ సహా పలు ప్రదేశాల నుంచి వెళ్లిన ప్రముఖులతో దిగిన ఫోటోలను సీఎం చంద్రబాబు పంచుకున్నారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ అజయ్ బంగా సింగపూర్ గౌరవ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం తదితరులను సీఎం చంద్రబాబు కలిశారు.