దేశం గర్వించే దార్శనికుడు చంద్రబాబు..ఆయన కోసమే ఈ  యాత్ర:బండ్ల గణేష్

Spread the love

ఈ దేశంలోనే అత్యంత గొప్ప నాయకుల్లో చంద్రబాబు ఒకరని అలాంటి వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు ఎంతో బాధపడ్డట్లు సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తెలిపారు. జైలు నుంచి చంద్రబాబు బయటికి వస్తే  తిరుమలకు నడిచి వస్తానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నట్లు పేర్కొన్నారు. 20 రోజుల్లో తిరుమలకు  పాదయాత్ర పూర్తవుతుందని వివరించారు. తాను చేపడుతున్న ‘సంకల్పయాత్ర’కు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని గణేశ్ అన్నారు. చంద్రబాబు పై అభిమానంతో దేవుడికి మొక్కు చెల్లించేందుకు దీన్ని చేపట్టినట్లు తెలిపారు. షాద్ నగర్ నుంచి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో బండ్ల గణేశ్ మాట్లాడారు. చంద్రబాబు అరెస్టయిన సమయంలో మొక్కుకున్న మొక్కును తీర్చుకునేందుకు ఈ పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. జైలు నుంచి ఆయన తిరిగివస్తే తిరుమలకు పాదయాత్రగా వస్తానని ఏడుకొండలవాడిని మొక్కుకున్నట్లు తెలిపారు. దేవుడి ఆశీస్సులతో 52 రోజుల తర్వాత చంద్రబాబు విడుదలయ్యారు. అలాంటి వ్యక్తి తెలుగుజాతికి చాలా అవసరమని పేర్కొన్నారు.