నగరిలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు

Spread the love

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సంవత్సరం క్రితం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ప్రారంభించామని  తెలిపారు. చిత్తూరు జిల్లా నగరిలో ఈరోజు సీఎం పర్యటించారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని మన జీవన విధానం కావాలని పేర్కొన్నారు.  మనం పీల్చే గాలి స్వచ్చంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని అలాగే  మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలన్నారు.  చెడు ఆలోచనలతో నేరస్థులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో చూశాం. స్వచ్ఛమైన ఆలోచనలు ఉంటేనే భవిష్యత్తు ఉంటుందన్నారు.  మార్చిలోపు కోటి 12 లక్షల టన్నుల చెత్తను పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేశారు. చెత్త నుంచి కరెంట్ తయారు చేసే ప్రాజెక్టులు విశాఖ, గుంటూరులో వచ్చాయి. కర్నూలు, రాజమహేంద్రవరం, కడప, నెల్లూరులో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వారానికి ఒకసారి స్వచ్ఛ రథాలు వచ్చేలా చేస్తున్నాం. చెత్త తీసుకుని తిరిగి నిత్యావసర వస్తులు ఇచ్చే విధంగా  చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2018లోనే రాష్ట్రాన్ని ఓడిఎఫ్ (Open Defecation Free)గా తయారు చేశాం. ఇప్పుడు ఓడిఎప్ ప్లస్ దిశగా వెళ్తున్నట్లు వివరించారు.