అమెరికాలో భారీ మంచు తుపాను వణికిస్తోంది. దీంతో పలు రాష్ట్రాల్లో భారీస్థాయిలో హిమపాతంతో పాటు ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. ఈ తుపాను కారణంగా పలు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో రవాణాకు ఆటంకం కలిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంచు తుపాను కారణంగా అమెరికాలోని 20 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రభావితం కానున్నట్లు అధికారులు తెలిపారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ హెచ్చరికలతో అమెరికాలోని రాష్ట్రాలు అలర్టయ్యాయి. కెంటకీ, వర్జీనియా, కాన్సస్, ఆర్కాన్సాస్, జార్జియా, మిసిసిపి సహా పలు రాష్ట్రాలు ఎమర్జెన్సీ పెట్టాయి. మిసిసిపి, ఫ్లోరిడా: వంటి దక్షిణాది రాష్ట్రాల్లోనూ శీతల వాతావరణ పరిస్థితుల కారణంగా చలి తీవ్రంగా ఉంటుందని మిస్సోరి, ఇల్లినోయీలలోనూ భారీ మంచు కురిసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా అనేక ప్రాంతాల్లో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడనుందని, వాహనదారులు మంచులోనే చిక్కుకుపోయే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇది ఈ డికేడ్ లోనే అతి తీవ్రమైనదిగా నిలుస్తుందని తెలిపారు.