కీర్తి చక్ర పురస్కార గ్రహీత, మేజర్ మల్లా రామ్గోపాల్నాయుడిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భారీ నగదు బహుమతి ప్రకటించింది. ఆయనకు రూ.1.25 కోట్లు అందిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు ఉత్తర్వులిచ్చారు. మేజర్ రామ్గోపాల్నాయుడు స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం నగిరిపెంట గ్రామం.2023 అక్టోబర్ 26న జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో మేజర్ రామ్గోపాల్ నాయుడు అసమాన ధైర్యసాహసాలు కనబరిచారు. కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులు చొరబడ్డారన్న సమాచారంతో రామ్గోపాల్ నాయుడు బృందం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ ఆపరేషన్లో మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టి ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు.