మాజీ సీఎం జగన్ పై ఏపీ మంత్రి లోకేష్ ఫైర్ 

Spread the love

శ్రీవారికి చేసిన మహా పాపం కప్పిపుచ్చుకోవడానికి మహాపరాధం చేసావు అంటూ జగన్ పై ఏపీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు . మీకు దేవుడంటే భక్తి లేదు, భయం లేదు. హిందువుల మనోభావాలంటే లెక్కేలేదని సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.  మీ వైసీపీ ఎమ్మెల్సీలు బూట్లు, చెప్పులతో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు పట్టుకుని మహాపరాధం చేశారు. అంతే కాకుండా కౌన్సిల్ లో ప్రదర్శించిన శ్రీవారి ఫొటోలు అక్కడే విసిరేసి వెళ్ళిపోవడం క్షమించరాని పాపం. వెంకన్నతో పెట్టుకోవద్దు జగన్ అంటూ లోకేష్ ఫైర్ అయ్యారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *