హోంశాఖ బడ్జెట్ అంచనాలపై ఉన్నతాధికారులతో హోం శాఖ మంత్రి అనిత సమీక్ష

Spread the love

రాష్ట్ర సచివాలయంలో ఏపీ హోం శాఖ మంత్రి అనిత హోంశాఖ బడ్జెట్ అంచనాలపై పోలీస్, ఇంటలిజెన్స్, ఎస్పీఎఫ్, ఫైర్ సర్వీసెస్, పోలీస్ స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్, ఈగల్, ఆక్టోపస్ తదితర విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా, పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. హోంశాఖ బడ్జెట్ అంచనాలపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశంలో ఆయా శాఖల అవసరాలు, నిధులపై చర్చించారు. పోలీస్ శాఖ ఆధునీకరణకు పెద్దపీట వేస్తూ సిబ్బందికి మెరుగైన వసతులు, వనరుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. నేర నియంత్రణలో అత్యాధునిక సాంకేతికత వినియోగంతో ప్రజల భద్రత విషయంలో రాజీ పడకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు.  సమావేశంలో హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ్ కుమార్, ఇంటెలిజెన్స్ ఐజీ రామకృష్ణ, ఫైర్ సర్వీసెస్ డీజీ వెంకటరమణ, ఎస్పీఎఫ్ ఐజీ వెంకట రమణారెడ్డి, స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్ ఐజీ అబురాజన్, ఈగల్ ఐజీ రవికృష్ణ, పీటీఐ డీఐజీ సత్యఏసుబాబు, బెటాలియన్ ఐజీ శ్రీమతి రాజకుమారి, ఆక్టోపస్ & ఈగల్ ఐజీ సెంథిల్ కుమార్ తో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.