తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Spread the love

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ జరగనుండగా.. ఫిబ్రవరి 13వ తేదీన కౌంటింగ్ జరగనుంది.రేపటి నుండి జనవరి 30వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, ఫిబ్రవరి 3వ తేదీన అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నారు. వచ్చే నెల 16వ తేదీన కార్పొరేషన్‌ లలో మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరగనున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో 52 లక్షల 43 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. కంట్రోల్ రూం నుంచి ఓటింగ్ ప్రక్రియను మానిటరింగ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. రూ.50 వేలకు మించి నగదుకు లెక్క చూపవలసి ఉంటుందని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతాయని వివరించారు.