ఆదాయ రాబడిలో ఏ.పీ.ఎస్.ఆర్.టీ.సీ సరికొత్త రికార్డ్ సృష్టించింది. సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల నుంచి ప్రజలంతా వారి వారి స్వగ్రామాలకు చేర్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆర్టీసీ రికార్డు స్థాయిలో ఆదాయార్జన చేసింది. ఈ క్రమంలోనే జనవరి 19న ఒక్క రోజే సంస్థకు రూ.27 కోట్ల 68లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఒక్కరోజులోనే 50.6 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ చరిత్రలోనే ఈ స్థాయిలో ఆదాయం ఆర్జించడం ఇది మొదటి సారి అని తెలుస్తోంది. ఈ సందర్భంగా సంస్థలో భాగమై ఈ రికార్డు సృష్టించడంలో కీలకమైన డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్ వైజర్లు, గ్యారేజ్ సిబ్బందిని ఎండీ ప్రత్యేకంగా అభినందించారు.