లోక్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం..హాజరైన సీఎం,డిప్యూటీ సీఎం

Spread the love

రిపబ్లిక్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోక్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం జరిగింది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అతిథులకు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో ఏపీ  సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, సవిత, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్జీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ కు నేతలు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలు అద్భుతంగా జరిగాయి. నేలపాడు ప్రాంతంలోనిలో పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకలోని పాల్గొన్న 22 శకటాలు రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబించాయి.