సమయం వచ్చినప్పుడు అన్నీ చెబుతాను..!

Spread the love

నటి రష్మిక మందన్న – హీరో విజయ్ దేవరకొండ వార్తలు గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో, ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అంతేకాదు… వీరిద్దరూ ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు రష్మిక గానీ, విజయ్ గానీ క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న రష్మికను నేరుగా అడగగా… ఆమె ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. ఈ విషయంపై స్పందించిన రష్మిక… “ఇలాంటి రూమర్స్ గత నాలుగేళ్లుగా వస్తూనే ఉన్నాయి. నిజం ఏంటన్నది చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతాను. సరైన సమయం వచ్చినప్పుడే అన్నీ బయటపెడతాను” అని చెప్పింది. ఎప్పటిలాగే ఆమె ఈ వార్తలను ఖండించలేదు… అలానే పూర్తిగా ఒప్పుకోనూ లేదు. అయితే ఆమె మాటల తీరును బట్టి చూస్తే, పెళ్లి విషయమై త్వరలోనే ఏదో ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందేమో అన్న సంకేతాలు అభిమానుల్లో చర్చకు దారి తీసాయి.రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘గీత గోవిందం’. ఆ సినిమా విడుదలైన తర్వాతే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది అన్న గుసగుసలు మొదలయ్యాయి. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో మరోసారి కలిసి నటించడంతో ఈ వార్తలు మరింత బలపడ్డాయి. అయితే అప్పట్లో మాత్రం ఇద్దరూ కూడా తమ  మధ్య అలాంటిదేమీ లేదని స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు. రష్మిక మందన్న ఇటీవల ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాలో కనిపించింది. ఇక రాబోయే రోజుల్లో ఆమె ‘కాక్టెయిల్ 2’, ‘మైసా’ వంటి చిత్రాల్లో నటించనుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, వ్యక్తిగత జీవితంపై మాత్రం ఎప్పటిలాగే రష్మిక సస్పెన్స్ కొనసాగిస్తోంది.మొత్తానికి… “సమయం వచ్చినప్పుడు అన్నీ చెబుతాను” అన్న రష్మిక మాటలే ఇప్పుడు అభిమానులకు కొత్త ఆశను ఇచ్చాయి. నిజం బయటపడే రోజు కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.