సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు, లోకేష్ నివాళులు

Spread the love

దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా పేరు పొందిన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లు నివాళులర్పించారు. 

ఏపీ సీఎం చంద్రబాబు:

మహిళలను విద్యావంతులుగా చేసేందుకు సమాజ కట్టుబాట్లను కాదనే సాహసాన్ని చేసి దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా పేరు పొందిన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. ఆనాడు ఆమె చేసిన సాహసం ఈనాడు మహిళలను విద్యావంతులుగా చేయడమే కాకుండా పురుషులకన్నా మిన్నగా అవకాశాలను సద్వినియోగం చేసేలా తీర్చిదిద్దింది అనడంలో సందేహం లేదు. అందుకే సావిత్రిబాయి పూలేకు ఆధునిక మహిళలు సదా కృతజ్ఞతలు తెలపాల్సి ఉంది. సమాజంలో సగభాగమైన మహిళా విద్యలో కీలక పాత్ర పోషించిన సావిత్రీ బాయి పూలేకు మరొక్కమారు ఘన నివాళి అర్పిస్తున్నాను.

మంత్రి నారా లోకేష్:

సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. సావిత్రిబాయి పూలే మన దేశ మొట్టమొదటి మహిళా టీచర్. స్త్రీ విద్య, హక్కుల సాధన కోసం జీవితాంతం కృషిచేశారు. ఉపాధ్యాయ వృత్తిని సమాజ మార్పునకు శక్తివంతమైన సాధనంగా భావించారు. సామాజిక వ్యతిరేకత, అవమానాలు ఎదురైనా బాలికల విద్య కోసం ధైర్యంగా ముందుకు సాగారు. నేటి మహిళా ఉపాధ్యాయులకు ఆమె మార్గదర్శి. సావిత్రిబాయి పూలే ఆశయ సాధన కోసం కృషి చేయడమే ఆమెకు మనం అర్పించే నిజమైన నివాళి.