రజనీ – కమల్ మూవీకి ‘శిబి చక్రవర్తి’ దర్శకత్వం..!

Spread the love

సూపర్ స్టార్ రజనీకాంత్ 173వ చిత్రానికి సంబంధించిన ఉత్కంఠకు తెరపడింది.ఈ చిత్రానికి యువ దర్శకుడు శిబి చక్రవర్తి (డన్/Don ఫేమ్) దర్శకత్వం వహించనున్నట్లు ఈరోజు అధికారిక ప్రకటన వెలువడింది.ఉలగనాయకన్ కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థ ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ ద్వారా ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.సుమారు 46 ఏళ్ల తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ కలయికలో సినిమా వస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.కాగా ఈ చిత్రానికి సుందర్.సి దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చినప్పటికీ, ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు.ఈ క్రమంలోనే రజనీకాంత్ స్వయంగా శిబి చక్రవర్తి కథ పట్ల ఆసక్తి చూపడంతో ఆయనకు ఈ సువర్ణావకాశం లభించింది.ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, రెడ్ జెయింట్ మూవీస్ పంపిణీ బాధ్యతలు చేపట్టింది.ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.