నేడు పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు సందర్శించారు. ఈ సందర్శన కోసం వచ్చిన ఆయనకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘన స్వాగతం పలికారు.పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని నేడు ఏరియల్ విజిట్ ద్వారా పరిశీలించారు. వ్యూ పాయింట్ నుంచి స్పిల్ వే సహా మొత్తం ప్రాజెక్టును, డయాఫ్రమ్ వాల్ సహా ఇతర నిర్మాణాలను సీఎం వీక్షించారు.