త్వరలోనే పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

Spread the love

రాష్ట్రవ్యాప్తంగా 21.80లక్షల  పట్టాదారు పాసు పుస్తకాలు కొత్త సంవత్సరంలో జనవరి 2 నుంచి 9వరకు పంపిణీ చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రభుత్వరాజముద్రతో కొత్తగా ముద్రించిన వీటి పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు తాజాగా ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. గత ప్రభుత్వంలో సీఎం తన ఫొటోను రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలపై ముద్రించారు. సర్వే రాళ్లను సైతం వదల్లేదు. పెద్దఎత్తున ప్రజాధనం దుర్వినియోగం చేశారని విమర్శించారు. ప్రస్తుతం పంపిణీ చేయనున్న పాస్ పుస్తకాల్లో తప్పులేమైనా ఉంటే  వెంటనే సరి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. గ్రేటర్ విజయవాడ, తిరుపతి ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయన్నారు.