ఉద్యోగులు, పెన్షనర్లు, పోలీసులు, కాంట్రాక్టర్లకు జోష్..సంక్రాంతి వేళ ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

Spread the love

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకగా ఉద్యోగులు, పెన్షనర్లు, పోలీసులు, కాంట్రాక్టర్లకు భారీ ఉత్సాహాన్ని అందించే కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తంగా దాదాపు 5.70 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు, పోలీసులు, కాంట్రాక్టర్లకు ఈ సంక్రాంతి వేళ ఆర్థిక ప్రయోజనం దక్కనుంది. 

ఉద్యోగుల డీఏ, డీఆర్ ఎరియర్స్, పెండింగ్ బిల్లులు, బకాయిల క్లియరెన్స్ కోసం రూ. 2,653 కోట్లను విడుదల చేసింది. ఇందులో సింహభాగం భాగం డీఏ, డీఆర్ ఎరియర్స్‌ కి మంజూరు చేసింది. ఒక పెండింగ్ ఇన్‌స్టాల్‌మెంట్ కోసం రూ. 1,100 కోట్లు విడుదల చేసింది. దీంతో సీపీఎస్ ఉద్యోగుల్లో 2.25 లక్షల మంది, పెన్షనర్లలో 2.70 లక్షల మంది నేరుగా బెన్ఫిట్  పొందుతారు. పోలీస్ సిబ్బందికి కూడా సరెండర్ లీవుల బకాయిల కోసం రూ. 110 కోట్లు మంజూరు చేశారు. దీనివల్ల దాదాపు 55 వేల మంది పోలీసులకు  లబ్ది చేకూరనుంది. ఇక కాంట్రాక్టర్లకు సంబంధించి ఈఏపీ, నాబార్డు, సాస్కీ, సీఆర్ఐఎఫ్ వంటి ప్రాజెక్టుల కింద చేసిన పనుల బిల్లులకు రూ. 1,243 కోట్లువిడుదలయ్యాయి. అందులోనే ‘నీరు-చెట్టు’ పథకం బిల్లులకు సుమారు రూ. 40 కోట్లు కేటాయించారు. దీంతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టిన 19 వేలకు పైగా కాంట్రాక్టర్లకు బిల్లుల పేమెంట్స్ జరగనున్నాయి.