టాక్సిక్ టీజర్ ఇష్యూ..రంగంలోకి మహిళా కమిషన్

Spread the love

కన్నడ నటుడు ‘యష్’ హీరోగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ టీజర్ విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ టీజర్లో అశ్లీల సన్నివేశాలపై కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ కు  ఆన్ఆద్మీ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో  మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. ఈ వివాదంపై తగిన చర్యలు తీసుకొని నివేదిక సమర్పించాలంటూ సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. టీజర్ లో పిల్లల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అభ్యంతరకరమైన దృశ్యాలు ఉన్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉషామోహన్ మహిళా కమిషన్ కు  చేసిన ఫిర్యాదులో వివరించారు. టీజర్ ను తొలగించాలని కోరారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న కమిషన్ సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. సమస్యను పరిశీలించాలని లేఖలో పేర్కొంది. ఇక ఈచిత్రాన్ని గీతూ మోహన్దాస్ దర్శకత్వం వహించారు. ‘టాక్సిక్.టైటిల్ కాగా, ‘ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్అప్స్’ అనేది సబ్ టైటిల్. యశ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఇటీవల ఓ గ్లింప్ను విడుదల చేశారు. అయితే అందులో ఇంటిమేట్ సీన్స్ ఎక్కువగా ఉండడంతో విమర్శలొచ్చాయి.