పల్నాడు జిల్లా, పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల్లో సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు.సీఎం చంద్రబాబు ప్రారంభించిన ‘ప్రజల వద్దకు పాలన’, మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ‘ప్రజా దర్బార్’ కార్యక్రమాల స్ఫూర్తితో ఆయన నియోజకవర్గంలో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు.ఈ మేరకు నియోజకవర్గ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నేరుగా ప్రజల వద్దకు వెళ్లి, వారి వినతులను స్వయంగా స్వీకరిస్తూ తక్షణ పరిష్కారం చూపుతున్నారు.ఈ వినూత్న శైలికి పెదకూరపాడు ప్రజల నుండి భారీగా స్పందన లభిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఇప్పటి నుంచే పక్కా రూట్ మ్యాప్‌తో ముందుకు సాగుతున్న ఆయన, ఇతర ఎమ్మెల్యేలకు కూడా ఆదర్శంగా నిలిచారు.క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతున్న తీరుపై నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.అధికార యంత్రాంగాన్ని సైతం భాగస్వామ్యం చేస్తూ ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు.